ఇతర ప్రాంతాలమద్యానికి అనుమతి లేదు
భీమవరం: సంక్రాంతి పండుగకు ఇతర రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడి మద్యం తీసుకురావడం నేరమని జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్‌వీ ప్రసాద్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. మద్యం తీసుకువచ్చి పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇదే విషయాన్ని ప్రైవేట్ బస్సు, టూరిస్ట్ బ స్సు, ప్రైవేట్ టాక్సీ యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారన్నారు. అలాగే 13.05 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 95 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం రవాణా కాకుండా వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పునరావృతం కాకూడదని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అధికారులతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి 211 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో పీజీఆర్‌ఎస్ ద్వారా 158 , రెవెన్యూ క్లినిక్ ద్వారా 53 అర్జీలు వచ్చాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్నారు.
1 నుంచి ఈ–ఆఫీస్
ఫిబ్రవరి 1 నుంచి అన్ని శాఖలు ఫైళ్లను ఈ– ఆఫీస్ ద్వారా మాత్రమే సమర్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. రాష్ట్ర సచి వాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అ ద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల కారణంగా సమ్మె నోటీ సు ఇస్తున్నట్టు భీమవరం మున్సిపల్ కాంట్రాక్టర్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎ దుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు విధానంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సుమారు రూ.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పాత బకాయిలు చెల్లించే వరకూ కొత్త పనుల టెండర్లలో పాల్గొనరాదని నిర్ణయించామన్నా రు. కాంట్రాక్టర్లు కార్తీక్ వర్మ, ఆచంట వేణు మాధవ్, సీహెచ్ సాయి ప్రసాద్, ఇంటి శేషగిరి, కృష్ణంరాజు, దేవాన్ సాయిరాం, అందే వరప్రసాద్, ఆచంట భగవాన్, మోటుపల్లి భాస్కరరావు, సీహెచ్ సుధాకర్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దే శక్తి యువతేనని సోమవారం నిట్‌లో జరిగిన జాతీ య యువజన దినోత్సవంలో వక్తలు అన్నారు. నిట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్, అలుమ్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబీ వీరేష్‌కుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంట్రల్ హాలులో యువజ న దినోత్సవం నిర్వహించారు. వీరేష్‌కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన్ను ఆదర్శంగా తీ సుకోవాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ కార్తికేయశర్మ, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ లైబ్రేరియన్ మహంతి పాల్గొన్నారు.
ఇతర ప్రాంతాలమద్యానికి అనుమతి లేదు
ఇతర ప్రాంతాలమద్యానికి అనుమతి లేదు


