బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఆంధ్రాగా విక్రమ్
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీల్లో వైజాగ్‌కు చెందిన విక్రమ్ మిస్టర్ ఆంధ్రాగా ఎంపికయ్యాడు. ఆదివారం రాత్రి స్థానిక చిన్నకార్ల స్టాండ్ వద్ద కేఏఎం జిమ్ పాలకొల్లు ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బెస్ట్ మజిల్స్ భాస్కర్ – వైజాగ్, బెస్ట్ మస్కిలర్‌గా ప్రశాంత్ – మచిలీపట్నం ముగ్గురు ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో 50 నుంచి 90 మంది బాడీబిల్డర్లు పోటీ పడినట్లు నిర్వాహకులు ఖండవల్లి వాసు తెలిపారు. విజేతలకు చాంబర్ సభ్యులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనందప్రకాష్, చేగొండి సూర్యప్రకాష్, మేకా శేషుబాబు, కేఎస్‌పీఎన్ వర్మ, ఉచ్చుల స్టాలిన్, సనమండ ఎబినేజర్, రామాంజుల పెద్దమదు, పసుపులేటి రాజేష్‌ఖన్నా, తటవర్తి సుధాకర్, సబితి వెంకటరెడ్డి, వింజరపు రాము, పసుపులేటి రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


