కవి ప్రసాద్‌కు అరుదైన గౌరవం
తణుకు అర్బన్: హైదరాబాద్ త్యాగరాయ గాన సభ, జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈనెల 6న నిర్వహించిన కార్యక్రమంలో తణుకు పట్టణానికి చెందిన జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత పొత్తూరు సుబ్బారావు రచించిన ప్రకాశ కిరణాలు అనే సంపాదకీయాల సంపుటిని ఈ వేదికపై ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సంపుటిని ఆవిష్కరించగా కవి ప్రసాదుకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవి ప్రసాదును ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పి.విజయబాబు, పొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మి, త్యాగరాయగానసభ అధ్యక్షుడు వీఎస్ జనార్ధన మూర్తి, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు తదితరులు వీఎస్‌వీ ప్రసాద్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.


