5,700 హెక్టార్లలో పంట నష్టం
● రూ.72 కోట్ల నష్టం
● కేంద్ర బృందానికి కలెక్టర్ నివేదిక
ఉంగుటూరు: జిల్లాలో మోంథా తుపాను నష్టాన్ని పరిశీలించిడానికి కేంద్ర బృందం సోమవారం ఉంగుటూరు మండలంలో పర్యటించింది. జిల్లాలో 5,700 హెక్టార్లులో పంటనష్టం జరిగిందని. రూ.72 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కలెక్టరు వెట్రిసెల్వి కేంద్ర బ్రందానికి వివరించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం శివారులో పంట చేలను కేంద్ర బ్రందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర వ్యవసాయ శాఖ డైరెక్టరు డాక్టర్ కె.పొనుస్వామి, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టరు శ్రీనివాసు, కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైకెక్టరు ఆర్తీ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టరు మనోజ్ కుమార్ మీనా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. జిల్లా యంత్రాంగం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులతో మాట్లాడారు. ఎంటీయు7029 రకం బాగా దెబ్బతిందని వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా వివరించారు. జిల్లాలో 17.63 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఇందులో బొప్పాయి, అరటి వంటి పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర బ్రందం సభ్యులకు కలెక్టర్ వివరించారు. తుపాను వల్ల నిరాశ్రయులైన 3,400 మందిని 19 పునరావాస కేంద్రాల్లో ఉంచామని, రూ.3 వేలు నగదు , నిత్యావసర వస్తువులు ఇచ్చినట్లు చెప్పారు. తుపాను వల్ల జిల్లాలో 19 ఇళ్లు పడిపోయాయిని, రెండు పశువులు మృతిచెందాయని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, ఉద్యాన అధికారి షాజా నాయక్, తహసీల్దారు పూర్ణచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
5,700 హెక్టార్లలో పంట నష్టం


