సెమీ కండక్టర్లదే కీలక పాత్ర
తాడేపల్లిగూడెం: ఫీల్డ్ ఎఫెక్టు ట్రాన్స్‌ఫార్మర్లలో సెమీ కండక్టర్లదే కీలక పాత్ర అని హైదరాబాద్ ఐఐటీ ఆచార్యులు డాక్టర్ సురేష్‌కుమార్ గార్లపాటి అన్నారు. ఏపీ నిట్‌లో సోమవారం జరిగిన ఏఎన్‌ఆర్‌ఎఫ్, పీఏఐఆర్ అనే అంశంపై సోమవారం గెస్ట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా వినియోగిస్తున్నాయన్నారు. ఈ పరికరాలు తక్కువ ధరకే దొరకడంతో పాటు అన్ని రకాల సబ్ స్పైట్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు. మరో అతిఽధి ఐఐటీ ఆచార్యులు డాక్టర్ నరేంద్ర కుర్రా మాట్లాడుతూ మానవాళికి అత్యంత అవసరమైన విద్యుత్ శక్తిని సౌర పవన, బయోమాస్, సముద్ర ఉష్ణ, జియో ఉష్ణ వంటి వనరుల నుంచి పొందవచ్చన్నారు. విద్యుత్ శక్తిని సరఫరా చేయడంలో బ్యాటరీలు సూపర్ కెపాసిటర్లుగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మెకానికల్, ఎంఎంఐ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీన్ కిరణ్‌శాస్త్రి, కార్తికేయశర్మ, సంతోష్ బెహ్రా కోఆర్డినేటర్లుగా వ్యవహరించగా అధికారులు పాల్గొన్నారు.
ఐఐటీ ఆచార్యులు డాక్టర్ సురేష్‌కుమార్


