
నరసాపురంలో ఉగ్ర గోదావరి
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదు రోజులుగా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వలంధర్ రేవులో పిండ ప్ర ధానాలు చేసే షెడ్డుపైకి నీరు చేరింది. గో దావరి మాత విగ్రహం వద్ద నీటిమట్టం పె రిగింది. వలంధర్ రేవు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. సముద్ర పోటు సమయంలో నీటిమట్టం మరింత పెరుగుతోంది. పట్టణ పరిధిలో ఐదు చోట్ల అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల నుంచి గోదావరి నీరు ఎగదన్నుతోంది. గోదావరి బండ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలు వరద తాకిడి గురయ్యే ప్రమాదం ఉంది.
మళ్లీ పెరిగిన గోదావరి
వేలేరుపాడు: ఎడతెరపి లేని వర్షాలకు వాగు లు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచ లం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగు తోంది. గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35.40 అడుగులకు నీటిమట్టం చేరింది. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలోని ఎద్దెలవాగు వంతెన ఉదయమే నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న 18 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్ల గొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, టేకూరు, సిద్దారం, కుంకుడు కొయ్యలపాకలు మరో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు తహసీల్దార్ సత్యనారాయణ ఎద్దెలవాగు వద్ద నాటు పడవను ఏర్పాటుచేశారు.
5.53 లక్షల క్యూసెక్కులు దిగువకు..
పోలవరం రూరల్: పోలవరం వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు దిగువన స్పిల్‌వే వద్ద 30.400 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 5.53 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలతో మరో రెండు రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
గళమెత్తిన ఉపాధ్యాయులు
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని యూటీఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. యాప్‌ల భారం తగ్గిస్తామని చెబుతూనే ఒకే యాప్‌లో అనేక సమాచారాలు పెట్టమంటూ పనిభారం పెంచుతున్నారన్నా రు. ఏ మాత్రం సంబంధం లేని పీ4 వంటి విషయాలను ఉపాధ్యాయులపై మోపడం సమంజసం కాదన్నారు. బదిలీలు అయిన వారికి రిలీవ్ ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
నేడు ఎయిడెడ్ టీచర్ నియామక పరీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి, కోట్ల వెంకట రామయ్య బాలికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న 7 ఎయిడెడ్ టీచర్ పోస్టులకు ఆదివారం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. భీమవరం డీఎన్నార్ కాలేజీ అ టానమస్, డీఎన్నార్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్, తా డేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. హాల్‌టికెట్ కోసం 99892 71919 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.