కనులపండువగా శివ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా శివ కల్యాణం

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

కనులపండువగా శివ కల్యాణం

కనులపండువగా శివ కల్యాణం

ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం గురువారం కన్నులపండువగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కనులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement