సర్కారు నిండా ముంచేను | - | Sakshi
Sakshi News home page

సర్కారు నిండా ముంచేను

May 6 2025 1:08 AM | Updated on May 6 2025 1:08 AM

సర్కా

సర్కారు నిండా ముంచేను

ఆలమూరులో 807 ఎకరాల ఆయకట్టుకు దాళ్వా ధాన్యం అంచనా దిగుబడి సుమారు 3,147 టన్నులు. రైతులు ఓపెన్‌ మార్కెట్‌ నిమిత్తం 15 శాతం (472 టన్నులు) మినహాయించగా దాదాపు 2,674 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే 2,196 టన్నుల ధాన్యం మాత్రమే లక్ష్యంగా నిర్ణయించారు. సోమవారం నాటికి 1,934.76 టన్నులు సేకరించగా మరో 262 టన్నులు మిగిలి ఉంది. వారం క్రితమే ధాన్యం కోసి ఆరబెట్టామని, సకాలంలో సంచులు అందక మిల్లుకు తరలించలేకపోయామని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025

సాక్షి, భీమవరం: జిల్లాలోని 2.20 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో రైతులు ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయాలు, నిల్వ నిమిత్తం 1.50 లక్షల టన్నులు మినహాయించగా.. 7.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే 6 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 4.8 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. లక్ష్యానికి మించి మరో 1.5 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వాన్ని కోరినట్టు చెబుతున్నాయి.

రైతులను ముంచిన సంచుల కొరత

జిల్లాకు 1.49 లక్షల గోనె సంచులను సిద్ధం చేయగా ఇప్పటికే 1.12 లక్షల సంచులను వినియోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 37 లక్షల సంచులు ఆర్‌ఎస్‌కేల్లో ఉన్నాయని, సంచులకు కొరత లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే సంచుల కు కొరత ఉందని రైతులు వాపోతున్నారు. వారం, పది రోజుల క్రితం కోతలు కోసి ధాన్యం ఆరబెట్టుకున్నామని, సంచుల కోసం రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) చుట్టూ తిరిగినా ఫలితం లేదని పలు గ్రామాల్లో రైతులు తెలిపారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించలేక రోడ్లు పక్కన, కళ్లాల్లోనూ రాశులు పోసి నిల్వ ఉంచామంటున్నారు.

మరలా ఆరబెట్టాల్సిందే..

జిల్లావ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయి మరలా ఆరబెట్టేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. సకాలంలో సంచులు అందజేసి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. మరోపక్క వ స్తున్న సంచుల్లో చీకిపోయినవి, చిరిగిపోయిన ఉంటున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం మా సూళ్లు ముమ్మరమైన ఆచంట, తణుకు, పాలకొల్లు తదితర నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఉందంటున్నారు. కొరత లేకుండా నాణ్యమైన సంచులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

ధాన్యం.. వర్షార్పణం

పట్టుబడులకు సంచుల కొరత

ఆర్‌ఎస్‌కేల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

వారం క్రితం ధాన్యం ఆరబెట్టినా సంచుల్లేక ఇబ్బందులు

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

మరలా ఆరబెట్టాల్సి వస్తోందని ఆవేదన

సర్కారు నిండా ముంచేను1
1/1

సర్కారు నిండా ముంచేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement