త్రుటిలో తప్పించుకున్నాం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పించుకున్నాం

Apr 24 2025 8:35 AM | Updated on Apr 24 2025 8:35 AM

త్రుటిలో తప్పించుకున్నాం

త్రుటిలో తప్పించుకున్నాం

పాలకోడేరు: వారంతా కశ్మీర్‌లోని పహల్గాంలో కొద్దిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన సోము చైతన్య దీపక్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చైతన్య, అతని సోదరి అరుణ, స్నేహితుడు చిన్నారావులు వారి కుటుంబాలతో కలిసి ఈ నెల 20న పహల్గాం, గుల్మార్గ్‌ వెళ్ళి ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే గడిపారు. సోమవారం రాత్రి అక్కడి నుంచి శ్రీనగర్‌ వెళ్లిపోయారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం వారు గడిపిన ప్రదేశంలోనే టూరిస్ట్‌లపై ఉగ్రదాడుల ఘటన తెలియడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి శ్రీనగర్‌లో రూంకే పరిమితమయ్యామని, గురువారం సాయంత్రం ఫ్లైట్‌కు తిరుగు ప్రయాణమవ్వాలని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement