తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, ఇతర రంగాల్లో విద్యార్థులు బహుముఖ ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్‌వీ రమణరావు అన్నారు. శుక్రవారం నిట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిట్‌కు చెందిన విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, దీంతో అనేక పురస్కారాలను అందుకుంటున్నందుకు అభినందనీయమన్నారు. సీనియర్ విద్యార్థుల స్ఫూర్తితో జూనియర్‌లు ప్రేరణ పొంది అన్ని విషయాలలో అన్ని రంగాలల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను అందించారు. బీటెక్ 2021–25కు చెందిన బీటెక్ ఆఖరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలిదిండి పవన్‌తేజ సత్యవర్మను , తుమ్మూరి మంజునాథ్‌లను అభినందించారు. ఆలిండియా నిట్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన ఎస్.హర్షిత్‌ను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్‌రెడ్డి, బ్యాంక్ ఆప్ బరోడా పెదతాడేపల్లి బ్రాంచ్‌మేనేజర్ ఎం.కేదారి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల బహుముఖ ప్రతిభ అభినందనీయం