
ఇదేం.. న్యాయం సార్?
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో 1,327 స్కూల్ బస్సులు ఉన్నాయి. నిబంధనలు మేరకు స్కూల్ బస్సులు విద్యార్థుల రవాణకు మాత్రమే వినియోగించాలి. ఏదైనా ప్రమా దాలు జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు తదితర విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే స్కూల్ బస్సులు వినియోగించుకోవచ్చు. ఇతర ప్రైవేట్ అవసరాలకు వాటిని తీసుకువెళ్లకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే రవాణ శాఖ అధికారులు సంబంధిత స్కూల్ బస్సు పర్మిట్ సస్పెన్షన్‌తో పాటు రూ.10,000 జరిమానా, ఒక్కో సీటుకు రూ.1120 చొప్పున పన్ను విధిస్తారు. ఈ మేరకు గత నెల్లో భీమవరం నుంచి పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేసి భారీ మొత్తంలో జరిమానాలు విధించడం ప్రైవేట్ స్కూల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
అంతలోనే ఇలా.. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్య క్రమంలో భాగంగా రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు తణుకు పర్యటనకు వచ్చిన సందర్భంగా జన సమీకరణ కోసం అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులనే వినియోగించడం గమనార్హం. ప్రజావేదిక కోసం తణుకు, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో స్కూల్ బస్సులను వినియోగించి జనాలను సభా ప్రాంగణానికి తరలించారు. నిబంధనలు మేరకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ఇతర ప్రజా రవాణ వాహనాలు వినియోగించాల్సి ఉండగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చి బస్సులు తీసుకొచ్చారు. పెళ్లి బృందాలను తీసుకువెళ్లారని చెప్పి కేసులు పెట్టి జరిమానాలు విధించిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సుల్లో సభలకు జనాలను తరలించడం యాజమాన్యాలను విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల తీరుపై ప్రశ్నించాలని కొందరు భావించినప్పటికి లేనిపోని కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తారన్న ఉద్దేశ్యంతో మిన్నకుండిపోయినట్టు సమాచారం. కాగా ఈ విషయమై మాట్లాడేందుకు రవాణశాఖ అధికారులు సుముఖత చూపలేదు.
న్యూస్‌రీల్
పెళ్లికి స్కూల్ బస్సులు నడిపారని రూ. 1.85 లక్షల జరిమానా
తణుకులో చంద్రబాబు పర్యటనకు స్కూల్ బస్సుల్లోనే జనం తరలింపు
అధికారుల ఒత్తిడితో బస్సులు పంపిన యాజమాన్యాలు
రవాణ శాఖ తీరుపై ముక్కున వేలేసుకుంటున్న జనం
గత నెల 17న రాత్రి భీమవరం నుంచి గణపవరానికి పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న రెండు స్కూల్ బస్సులు, భీమవరం నుంచి ఆకివీడు వెళ్తున్న ఒక స్కూల్ బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. వాటిని భీమవరంలోని రవాణా శాఖ సీజర్ యార్డుకు తరలించి మూడింటికి కలిపి నుంచి రూ. 1,85,540 జరిమానా వసూలు చేశారు.

ఇదేం.. న్యాయం సార్?

ఇదేం.. న్యాయం సార్?