సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి
భీమవరం: యువఓటర్లు నిర్ణయాత్మకమైన ఆలోచనతో సమర్ధవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న చర్యలకు జిల్లాకు ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు లభించిందని, కలెక్టర్ అందుకున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు, సీనియర్ సిటిజన్‌న్ ఓటర్లు, ప్రజలతో ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమొంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో అధిక ఓటర్ల నమోదుకు ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులు అందించారు. ముందుగా సైకిల్ ర్యాలీకి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.


