అవార్డు అందుకున్న కలెక్టర్
భీమవరం(ప్రకాశం చౌక్): జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ చేతుల మీదుగా కలెక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న చర్యలను గుర్తిస్తూ శ్రీఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు – 2025్ఙను కలెక్టర్ అందుకున్నారు. మొత్తం 12 జిల్లాలను వివిధ అంశాలలో ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదు విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి తదితరులు అభినందించారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికి సంబంధించిన 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం, 6, 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా సమన్వయకర్త బి.ఉమాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. వివరాలకు పవన్ 9666699243, రవికిరణ్ 9989394224, వీరాస్వామి 9705515087 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
భీమవరం: ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈ కమిటీలో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పి.ఎన్.వి.ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జి.ప్రకాశం, బి.వి. నారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.రాంబాబు, ఎల్.రాజు, జి. ప్రసన్న కుమార్, ఎం.శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా పి.జనార్దన స్వామి, వి.రామ్‌మోహన్, ఎం.విజయ్ బాబు, పి.వి.రాఘవులు, ఏ.వీరభద్ర రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎస్.ఎస్.జాన్సన్, సభ్యులుగా ఎం.పుష్పరాజు, జి.దేవదాస్, వై.ఏడు కొండలు, రాష్ట్ర కౌన్సిలర్‌గా సీహెచ్ సత్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు.
తాడేపల్లిగూడెం: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ స్లాట్‌లు బ్లాకు చేస్తున్నారని సాక్షిలో ప్రచురితమైన వార్తకు గూడెం సబ్ రిజిస్ట్రార్ శేఖర్ స్పందించారు. కార్యాలయం బయట ఎవరైనా వ్యక్తులు బ్లాక్ చేస్తున్నారన్న సమాచారం తెలియచేస్తే, డిపార్టుమెంటు పరంగా చర్యలు తీసుకొని కక్షిదారులకు న్యాయం చేస్తామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో సహకార సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27 నుంచి గుంటూరులోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పీ.సుబ్బారావు, కోశాధికారి జీ.వీరయ్య ప్రకటనలో తెలిపారు. వంటావార్పు కార్యక్రమాలు జిల్లాల వారీగా ఏఏ తేదీల్లో నిర్వహించాలో రాష్ట్ర జేఏసీ షెడ్యూల్ ప్రకటించిందని తెలిపారు. వచ్చే నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో వంటావార్పు నిర్వహిస్తామని, 13న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులందరూ గుంటూరులో కమిషనర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
జి.ప్రకాశం, అధ్యక్షుడు
బి.వి నారాయణ, ప్రధాన కార్యదర్శి
అవార్డు అందుకున్న కలెక్టర్
అవార్డు అందుకున్న కలెక్టర్
అవార్డు అందుకున్న కలెక్టర్


