ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. నడవలేని రోగులను సహాయకులు వీల్‌చైర్‌పై స్కానింగ్‌కు, రక్తపరీక్షకు, ఎక్స్‌రేకు, ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది ఎవరూ స్పందించరు. బోలెడన్ని పనులున్నాయ్ మీరే తీసుకువెళ్లాలంటూ చిరాకుగా సమాధానాలు చెబుతారు. చేసేదేం లేక తామే తీసుకువెళ్తున్నామని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో పురుష, సీ్త్ర సహాయకులుగా సుమారు 35 మంది ఉండేవారని ఇప్పుడు కేవలం 12 మందికే పరిమితమయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఏలూరు జీజీహెచ్‌లో కనిపించిన దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
సాయం చేసేవారు లేక..