అర్హుల పేర్లు జాబితాలో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల పేర్లు జాబితాలో ఉండాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ఆత్మకూరు: అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలని, సర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన సర్‌ గ్రామసభకు హాజరై ఓటర్ల డాక్యుమెంట్ల సమర్పణ, అప్‌ లోడింగ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నోటీసు అందుకున్న వారు తగిన డాక్యుమెంట్‌ సమర్పించి ఓటు హక్కు పొందాలన్నారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి..

మండలంలోని కొత్తగట్టులో నర్సరీ, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌, డ్రెయినేజీ సోక్‌పిట్‌, ఇంకుడు గుంతలను పరిశీలించారు. మండల కేంద్రంలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను నిర్మాణాన్ని పరిశీలించారు. కొత్తగట్టులో వీఓ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, పీఆర్‌ డీఈ యుగంధర్‌, ఈజీఎస్‌ ఏపీఓ రాజిరెడ్డి, సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి, బీఎల్‌ఓలు సాజీదాబేగం, సారంగం, అశోక్‌, దేవమ్మ, శ్రీవిద్య, బీఎల్‌ఏలు పరికిరాల వాసు, రేవూరి జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేడం.. పింఛన్‌

ఆత్మకూరు: మండలంలోని అగ్రంపహాడ్‌ గ్రామానికి చెందిన మాదాసి అశోక్‌, మాదాసి నవిత తమకు దివ్యాంగుల పింఛన్‌ ఇప్పించాలని మండల కేంద్రంలో కలెక్టర్‌ను వేడుకున్నారు. పరిశీలించా లని ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు.

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెంచాలి

హన్మకొండ అర్బన్‌: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానాస్పద ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశం నిర్వహించారు. గత మూడు నెలల్లో జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల వివరాలను డీఎంహెచ్‌ఓ అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల నివేదికలను పరిశీలించడంతో పాటు కొత్త అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ సమాచారం అందించిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ట్రెయినీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌ నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్‌ రజిత, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఒంటేరు రమేశ్‌, బన్ను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నీతా, డెమో వి.అశోక్‌రెడ్డి, పద్మజ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement