ప్రజావాణికి ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి ప్రాధాన్యం ఇవ్వాలి

Aug 25 2026 1:39 AM | Updated on Aug 25 2026 1:39 AM

న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు 145 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 42, జీడబ్ల్యూఎంసీ 26, హౌసింగ్‌ 14, డీఆర్‌డీఓ 14, ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థ్య కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం అరగంట ముందు (ఉదయం 10గంటలు) ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాతో పాటు మండలాల పరిధిలో కూడా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల పరిధిలో ప్రజావాణి నిర్వహిస్తుండంతో జిల్లాలో నిర్వహించే గ్రీవెన్స్‌ వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement