పురపోరు షురూ
నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రత..
నామినేషన్లు దాఖలు చేసే నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పోలీసుల భద్రత ఉండనుంది. రిటర్నింగ్ అధికారులు బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థితో పాటు అతనిని బలపరిచే కొందరు అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.
సాక్షి, వరంగల్: మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మో గడంతో జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇన్నాళ్లు టికెట్ల కోసం ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేసిన బరిలో ఉండే అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కావడంతో పొలిటికల్ ఫైట్‌కు సిద్ధమవుతున్నారు. నామినేషన్లు ప్రారంభమయ్యే బుధవారం నుంచి చివరి రోజు శుక్రవారం వరకు మంచిరోజులు ఉండడంతో మూడు రోజుల పాటు నామినేషన్ల కోలాహలం కనిపించనుంది. ఇప్పటికే పార్టీ నుంచి అభయం పొందిన వారు తొలుత నామినేషన్ల సెట్లు వేసి, మళ్లీ పార్టీ ఇచ్చే బీ ఫాంతో మరో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా, ఇంకొందరు పార్టీ ఒకవేళ బీ ఫాం ఇచ్చేందుకు నిరాకరించినా రెబల్‌గా బరిలో ఉండేలా నామినేషన్లు దాఖ లు చేసి ఎన్నికల బరిలో ఉండాలనుకుంటున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు అక్కడి ముఖ్య నేతలతో సమావేశమై గెలుపు గుర్రాలెవరనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా అభ్యర్థులతో కూడిన జాబితా ఆయా పార్టీల అధిష్టానానికి వెళ్లాయని, ఇక గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తర్వాయనే చర్చ రాజకీయ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఎలాగైనా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతుండగా, తిరిగి ఆయా స్థానాలను నిలుపుకోవా లని బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ బీసీ మహిళ, వర్ధన్నపేట మున్సిపాలిటీ జనరల్ రిజర్వేషన్ కావడంతో గట్టి పోటీ నెలకొంది. వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే అరూరి బీజేపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరనుండడంతో అక్కడి మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నర్సంపేట మున్సిపాలిటీలో 40,968, వర్ధన్నపేటలో 10,526 మంది ఓటర్లు ఉన్నారు.
షెడ్యూల్ ఇలా..
ఈనెల 28, 29, 30 నామినేషన్ల స్వీకరణ, 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 3న ఉపసంహరణ ముగింపు, అదేరోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా విడుదల, 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్ని క ఉంటుంది.
రిజర్వేషన్లు ఇలా..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
బీ ఫాంపై కొందరు, ఇవ్వకున్నా
మరికొందరు దాఖలు..
రెబల్‌గా బరిలోకి దిగేందుకే ఆసక్తి
అభ్యర్థుల ఉపసంహరణ ఆయా పార్టీలకు సవాల్
ఇప్పటికే నేతల చేరికలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో జోష్
రిజర్వేషన్ నర్సంపేట వర్ధన్నపేట
ఎస్టీ జనరల్ 13, 16 7, 8
ఎస్టీ మహిళా 12 2
ఎస్సీ జనరల్ 22, 30 1
ఎస్సీ మహిళా 5, 23, 12
బీసీ జనరల్ 3, 24, 19 , 29 11
బీసీ మహిళా 8, 25 , 27, 28 0
జనరల్ 4, 6, 7, 10, 15, 17, 21 3, 6
జనరల్ మహిళా 1, 2, 9, 11, 14, 18, 20, 26 4, 5, 9, 10
పురపోరు షురూ


