మహాశివరాత్రి, రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: మహాశివరాత్రి, రంజాన్ పండుగల సందర్భంగా ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వేదపండితులు, ముస్లిం మతపెద్దలు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినంతో పాటు ఇదే నెలలో ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. దేవాలయాలు, మసీదుల వద్ద కలరింగ్, లైటింగ్, క్లీనింగ్, తాగునీటి సౌకర్యాలు, నిరంతర విద్యుత్ సరఫరా శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సెంట్రల్‌జోన్ డీసీపీ దార కవిత, డీఎండబ్ల్యూఓ టి.రమేష్, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వేదపండితులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15, 16వ డివి జన్లలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. పలు పనులను ప్రారంభించారు. నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహ త్ బాజ్‌పాయ్, కార్పొరేటర్లు సుంకరి మనీషా శివకుమార్, మనోహర్‌లతో కలిసి ఆయన కీర్తినగర్‌లో వాసవీ మాత కమ్యూనిటీహాల్‌ను ప్రారంభించారు. జాన్‌పాకలోని సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 15వ డివిజన్ గొర్రెకుంటలో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన, పోతరాజుపల్లి, మొగిలిచర్లలో సీసీ అంతర్గత రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ధర్మారాన్ని కొత్త మండలకేంద్రం చేయాలని వినతిపత్రంలో కోరారు. నాయకులు కొండేటి కొమురారెడ్డి, దుపాకి సంతోష్, ల్యాదల్ల సంపత్, వల్లెం సుధాకర్, గోదాసి చిన్న, వీరేశం పాల్గొన్నారు.
మార్కెట్‌కు
ఐదు రోజులు సెలవు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వ రుసగా ఐదు రోజులు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడారం జాతర సందర్భంగా వ్యాపారులు, దడువాయి, హమాలీ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు బుధ, గురు, శుక్రవారాలు సెలవులు ఇవ్వాలని వినతి మే ర కు మూడు రోజులు మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. అలాగే శనివారం యార్డు బంద్, ఆదివారం వారంతపు సెలవు ఉన్నందు న వరుసగా బుధవారం నుంచి ఆదివారం వరకు (5 రోజులు) మార్కెట్ బంద్ ఉంటుందన్నారు.
మహాశివరాత్రి, రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి


