పల్లె దవాఖానాలో మెరుగైన సేవలు
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రాయపర్తి: పల్లెదవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు మండలంలోని ఊకల్ గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) నిధుల ద్వారా రెండు గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున పల్లె దవాఖానాలను నిర్మించగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయపర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా క ల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నా రు. అనంతరం రైతువేదికలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు.


