నేతల్లో పండుగ జోష్
నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం
సాక్షి, వరంగల్: రాజకీయ నాయకులకు ‘పండుగ’ వాతావరణం బాగా కలిసొస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు ముందు అప్పుడు బరిలో ఉండే నాయకులు దసరా పండుగను అనుకూలంగా మలచుకొని మద్దతు కూడగట్టుకుంటే.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు సంక్రాంతి పండుగ రా వడంతో పోటీ పడాలనుకుంటున్న నేతలు తమకు వేదికగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగే నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రాజకీయ నేతల పండుగ వాతావరణం కనబడుతోంది. ఓవైపు ఓటర్ల తుది జాబితా పూర్తవడం, త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో ఇప్పటికే తమ కులానికే రిజర్వేషన్ వస్తుందని లెక్కలేసుకున్న నాయకులు ఇప్పటినుంచే జనాలను త మ వైపునకు తిప్పుకునేలా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగకు పట్టణాల్లో ఉంటున్న వారితో పాటు వివిధ నగరా లు, పట్టణాల్లో ఉపాధి కోసం వెళ్లిన కుటుంబాలు రానుండడంతో నేరుగా వారిని కలిసి మద్దతు కూడగట్టుకునేలా రాజకీయ చతురతను ప్రదర్శించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాత గారూ బాగున్నారా.. అక్క ఎట్లా ఉన్నారు.. అన్న పట్టణంలో అంతా బాగానే ఉందానే.. మిమ్ముల్ని చూసి చాలా రో జులువుతోంది ఎలాగున్నారూ.. అంటూ ఆత్మీయ పలకరింపులు చేస్తున్నారు. ఇక వివిధ కులాల్లో ముఖ్యులు, యువతను తమ దారికి తెచ్చుకునేందుకు పండుగ పేరిట పార్టీలు ఇచ్చేలా ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించారు. భారీగా మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఓవైపు మున్సిపల్‌లో పోటీ చేసేందుకు ముఖ్యులను చక్కబెడుతూనే.. స్థానికంగా పట్టు పెంచుకునేందుకు సంక్రాంతి పండుగ కలిసి రావడంతో ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. అన్ని పార్టీల్లోనూ నేతలు ఇదే పొకడతో పండుగ వాతావరణం నెలకొంది.
రిజర్వేషన్లపై అంచనా వేసి..
నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 40,960 మంది ఓటర్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 10,526 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా తుది జాబితా సిద్ధమవడంతో ఆయా స్థానిక రాజకీయ నేతలు రిజర్వేషన్లపై ఓ అంచనాకు వచ్చారు. నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉండడంతో కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న నాయకులు ఒకే పార్టీ నుంచే ముగ్గురికి పైగా ఉంటున్నారు. ము ఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో ఈ పరిస్థితి కనబడుతోంది. అందుకే సంక్రాంతి పండుగను వేదికగా చేసుకొని తమ బలబలాలను ఆయా డివిజన్‌లో పెంచుకునే పనిలో నేతలు బిజీఅయ్యారు. దీన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి టికెట్ దక్కించుకోవాలని తహతహలాడుతుండడంతో పేటల్లో పండుగ వాతావరణం కనబడుతోంది. ఒకవేళ పార్టీ నుంచి టికెట్ దక్కని పక్షంలో రెబల్‌గా పోటీ చేస్తామని తమ డివిజన్ ప్ర జల వద్ద మట్లాడుతూ మద్దతు ఉండేలా ఆశీర్వా దం పొందుతున్నారు. ఇలా సంక్రాంతి రాజకీయ నే తల సందడితో పండుగ జోష్ పెరిగినట్లయింది.
తుది ఓటరు జాబితా ఆధారంగానే రిజర్వేషన్లపై అంచనాలు
ఇప్పటినుంచే ఆత్మీయ పలకరింపులు
ఓవైపు పార్టీ ముఖ్యులను కలుపుకొని, ఇంకోవైపు జనాల మద్దతుండేలా..
‘సంక్రాంతి’ని అనుకూలంగా మలచుకునేలా ప్రణాళిక
నేతల్లో పండుగ జోష్
నేతల్లో పండుగ జోష్


