చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఖిలా వరంగల్‌: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఓరుగల్లు ఖ్యాతిని మరింతగా చాటాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ప్రభుత్వం యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కప్‌–2026 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖిలావరంగల్‌ మధ్యకోటలోని ఖుషిమహాల్‌ వద్ద సీఎం కప్‌–2026 ర్యాలీని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రూరల్‌ నుంచి గ్లోబల్‌ చాంపియన్‌ నినాదంతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం కోసమే సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత, విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31వ తేదీ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయన్నారు. క్రీడాకారులు అధిక సంఖ్య లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీ మధ్యకోట ఖుషిమహాల్‌ నుంచి జిల్లా కలెక్టరేట్‌ (ఐడీఓసీ) కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్ధార్‌ ఇక్బాల్‌, ఎంప్లాయీమెంట్‌ అధికారి కల్పన, కార్పొరేటర్‌ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్‌ దామోదర్‌యాదవ్‌, క్రీడాకోచ్‌ కై లాస్‌ యాదవ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

న్యూశాయంపేట: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వాహణపై కలెక్టరేట్‌ చాంబర్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, 25వ తేదీ నుంచి జరిగే వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాక్టికల్స్‌ ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించబడతాయన్నారు. 28 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌, 26 కేంద్రాల్లో థియరీ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్వ్కాడ్‌, 26 మంది చీఫ్‌ సూ పరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించామన్నారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్‌ లో సంప్రదించాలన్నారు. జిల్లా పరీక్షల కమిటీ కన్వీ నర్‌ శ్రీధర్‌సుమన్‌, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

క్రీడాజ్యోతి ర్యాలీ ప్రారంభం

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ త్వరగా పూర్తి చేయాలి

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వాహణకు తగు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. అధికారుల శిక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఈఓ రంగయ్యనాయుడు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement