కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు
నేను కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలు అయ్యింది. అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తగిన విచారణ జరిపి కులం సర్టిఫికెట్ ఇప్పించాలి.
– డి.శ్రీధర్, అప్పల్‌రావుపేట, నెక్కొండ
నా భూమి ఇప్పించండి..
నా పేరున ఉన్న భూమిని ఇద్దరు కొడుకులు ఆక్రమించుకున్నారు. నన్నూ నా భార్యను పోషించడం లేదు. అనారోగ్యాల కారణంగా అప్పులు అయ్యాయి. నా భూమిని ఇప్పించండి. అప్పులు తీర్చేందుకు నా కొడుకులకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
– బి.రాంకోటి, పిట్టలకాడిబోడు తండా
కులం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు


