
అభివృద్ధి తప్ప.. ఆదాయం వద్దా..
పరకాల : పరకాల పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కోరుతున్నాం సరే.. కానీ మున్సిపాలిటీ నుంచి కనీస ఆదాయంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ పరిధిలో ఇంటి, నల్లా పన్నులను వసూలు చేయాలని అధికారులను కోరారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, సకాలంలో వాణిజ్య పన్నులు వసూలు చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌లు నిబంధనల మేరకు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఆయన పారిశుద్ధ్యం, పట్టణ ప్రగతి పనులపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ కె.సుష్మా, పబ్లిక్ హెల్త్ ఈఈ సుచరణ్, ఏఈ రంజిత్ ఉన్నారు.
పన్నుల వసూళ్లపై దృష్టిసారించాలి
పరకాల మున్సిపాలిటీ
సమీక్షలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి