
ఆర్టీఏలో బ్రోకర్లదే హవా
శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
● ఇప్పటికే పలువురిపై కేసులు ● అయినా మారని దళారుల వ్యవహారం
హసన్‌పర్తి: హనుమకొండ, వరంగల్ ఆర్టీఏ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారం 15 ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది పేరుమోసిన దళారులే (బ్రోకర్లు) ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. నకిలీ పత్రాలు తయారు చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను మంగళవారం వరంగల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, హనుమకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ పోలీసులతోపాటు ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల ఆర్టీఏ పరిధిలో సుమారు 400మంది దళారులు ఉన్నారు. వీరిలో 30నుంచి 35మందిదే హవా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఆ బ్రోకర్ల దగ్గరకు ఫైల్ వెళ్తే.. అంతా ఓకే..
పేరు పొందిన బ్రోకర్ల ఫైల్ ఎంవీఐ, డీటీఓ వద్దకు వెళ్తే.. ఎటువంటిది చూడకుండా ఓకే అవుతోందనే చర్చ జరుగుతోంది. అదే మాములు స్థాయి బ్రోకర్ తీసుకెళ్తే లేనిపోని కొర్రీలు పెడుతుంటారని సమాచారం. పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు తమ బస్సుల ఫిట్‌నెస్ కోసం ఆ బ్రోకర్లనే ఆశ్రయిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులతోపాటు ఇతర పత్రాలు లేకుండా ఆర్టీఏకు వస్తే ఆ ఫైల్ ఓకే చేస్తారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయని తెలుస్తోంది.
బ్రోకర్లకు కోడింగ్..?
ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కో బ్రోకర్‌కు ఒక్కో కోడ్ ఇస్తారని స్థానికులు చెబుతున్నారు. ఆ కోడ్ ప్రకారం అధికారులు ఓకే చెబుతారనే స్థానికులు పేర్కొంటున్నారు. కోడ్ లేకుండా నేరుగా డాక్యుమెంట్ వస్తే.. రిజెక్ట్ చేస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
న్యూస్‌రీల్

ఆర్టీఏలో బ్రోకర్లదే హవా