
ఆరెపల్లి పాఠశాల తనిఖీ
న్యూశాయంపేట: నగర పరిధిలోని ఆరెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, విద్యార్థుల పఠనాసామర్థ్యాలు, పాఠశాల ఆవరణ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉండడంపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు తొలగించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వాచ్‌మన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు ఉన్నారు.
రైతులతో ఆర్బిట్రేషన్..
గీసుకొండ మండలం ఊకల్ గ్రామరైతులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్బిట్రేషన్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన 15 మంది రైతులతో ఫైనల్ ఆర్బిట్రేషన్ నిర్వహించి అవార్డు ప్రదానం చేశారు. ఇందులో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు శ్రీకాంత్, హైవే మేనేజర్, రైతులు పాల్గొన్నారు.