
చకచకా పనులు
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
సాక్షి, వరంగల్: జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదోననే సందిగ్ధంలో ఉన్న లబ్ధిదారులు.. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చాలామంది ముగ్గులు పోసి ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వీక్లీ పేమెంట్ సిస్టం’ తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 3,068 ఇళ్లలో 1,336 ఇళ్ల నిర్మాణాన్ని శ్రావణం మొదలయ్యాకే ప్రారంభించారని గృహనిర్మాణ విభాగాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే 1,722 మంది లబ్ధిదారులకు బేస్‌మెంట్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్ వరకు రూ.లక్ష నుంచి రూ.నాలుగు లక్షలు ఇస్తోంది. వీటిలో చాలా ఇళ్లు రూఫ్‌లెవల్ వరకు పూర్తయ్యాయి. ఇప్పటికే ముగ్గు పోసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్న 2,306 మంది లబ్ధిదారులు కూడా త్వరలోనే పనులు ప్రారంభించేలా అక్కడి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు కూడా అవగాహన కలిగిస్తున్నారు. వీరిలో చాలామందికి స్వయం సహాయక సంఘాలతో రుణాలు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇప్పించి, బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయ్యాక వచ్చిన డబ్బులను ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లో జమ అయ్యేలా కూడా అధికారులు చొరవచూపుతున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి డీఆర్డీఏ దరఖాస్తులు తీసుకుంది. ఈ రుణం మంజూరుకాగానే వందలాది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశముందని గృహనిర్మాణ విభాగాధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకోవడంతోపాటు పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుండడంతో పనులు ఊపందుకున్నాయి. గతంలో పైలట్ ప్రాజెక్టులో ఎదురైన ఇబ్బందులతో ఎక్కడ పొరపాటు జరుగకుండా పకడ్బందీగా యాప్‌లో అన్ని వివరాలు నమోదుచేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు.
డబ్బులు లేక ఆగుతున్న లబ్ధిదారులు..
జిల్లావ్యాప్తంగా 8,761 ఇళ్లు మంజూరుకాగా.. 5,374 మంది ముగ్గులు పోశారు. 3,068 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. 2,036 మంది ముగ్గులు పోసి.. డబ్బులు లేకపోవడంతో నెల రోజుల సమయం ఇవ్వాలని గృహనిర్మాణ విభాగాధికారులను అడుగుతున్నారు. మిగిలిన 3,387 ముగ్గు పోయని వారిలో కొందరు శ్రావణ మాసంలో ముగ్గు పోసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు స్వయం సహాయక సంఘాల నుంచి రుణం రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు..
న్యూస్‌రీల్
శ్రావణ మాసంలో ఊపందుకున్న
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
త్వరగా పూర్తిచేయాలని
అవగాహన కల్పిస్తున్న అధికారులు
వీక్లీ పేమెంట్ సిస్టంతో
లబ్ధిదారుల్లో పెరిగిన విశ్వాసం
ఆషాఢంలో మంచి రోజుల కోసం
ఎదురుచూపులు
మంజూరైన ఇళ్లు : 8761
ముగ్గులు పోసినవి : 5374
ముగ్గులు పోయనవి : 3,387
నిర్మాణంలో ఉన్నవి : 3,068
ప్రారంభించాల్సినవి : 2,306
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఎలగొండ కేత. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈమె ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. 32 రోజుల క్రితం పనులు ప్రారంభించింది. 20 రోజుల్లో పునాదిస్థాయి వరకు పనులు పూర్తి చేసింది. అధికారులు కొలతలను యాప్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వారం రోజులకు ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా లబ్ధిదారు కేత బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేసింది.
లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నాం..
గతంలోలాగా ఇల్లు వద్దంటున్నవారు లేరు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు తెచ్చుకునేందుకు నెలరోజుల సమయం కావాలని అడుగుతున్నారు. కొందరు ముహూర్తాల కోసం ఎదురుచూశారు. ఇప్పుడూ శ్రావణమాసంలో ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపని వారు ఎవరైనా ఉంటే వారికి గడువు ఇచ్చి, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. పూర్తిస్థాయిలో అందరూ కట్టుకునేలా ప్రోత్సహిస్తూ అందరం పనిచేస్తున్నాం.
– గణపతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్
మంచిరోజుల కోసం చూశాం
ప్రభుత్వం మా కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసింది. ఆషాఢ మాసం కావడంతో ముగ్గుపోసి వదిలేశాం. మంచి రోజుల కోసం ఇన్నాళ్లు వేచిచూశాం. శ్రావణమాసంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాం.
– త్రికోవెల రామ్మోహన్, నల్లబెల్లి

చకచకా పనులు

చకచకా పనులు

చకచకా పనులు

చకచకా పనులు