ఎల్‌ఆర్‌ఎస్‌.. నో కి ్లయరెన్స్‌! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌.. నో కి ్లయరెన్స్‌!

Aug 1 2025 5:53 AM | Updated on Aug 1 2025 5:53 AM

ఎల్‌ఆర్‌ఎస్‌.. నో కి ్లయరెన్స్‌!

ఎల్‌ఆర్‌ఎస్‌.. నో కి ్లయరెన్స్‌!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులో హుజూరాబాద్‌కు చెందిన ఓ టీచర్‌కు 400 గజాల స్థలం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 25 శాతం రాయితీపై మార్చి 30న రూ.60 వేల పైచిలుకు డబ్బులు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఆన్‌లైన్‌లో చెల్లించారు. ఇప్పటికీ ఆయన ఫైల్‌ క్లియరెన్స్‌ కాకపోగా.. ఎల్‌–1 స్టేజీలోనే పెండింగ్‌లో చూపుతుండడంతో అధికారులను కలిస్తే రేపు, మాపు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్‌ మామునూరు శివారులోని ఓ వెంచర్‌లో నగరంలోని బట్టల దుకాణంలో పనిచేసే ఒకరు 220 గజాల స్థలం తీసుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అప్పుచేసి ఏప్రిల్‌ 10న రూ.31 వేల వరకు ఆన్‌లైన్‌ చెల్లించారు. ఇప్పటివరకు తన ఫైల్‌ ఎల్‌–1 దగ్గరే ‘పెండింగ్‌’ చూపుతుందని చెప్పారు.

... ఇలా హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీ.. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు తీసుకుని ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించిన పలువురు ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధితో పాటు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించిన రసీదులతో అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

మొదటినుంచి ఇదే కథ..

అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 25శాతం మినహాయింపు ఉపయోగించుకోవాలని అనుకునే వారికి మొదటి నుంచి అవాంతరాలు తప్పడం లేదు. ప్రభుత్వం మార్చి 31 వరకు 25శాతం రాయితీ కల్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజ్‌ చెల్లింపునకు ఓపెన్‌కాని వెబ్‌సైట్స్‌.. యాక్సెప్ట్‌ కాని ఆన్‌లైన్‌లో కష్టాలు వెంటాడాయి. చివరికి దరఖాస్తుదారులు మున్సిపల్‌ ఆఫీస్‌లు, మీ– సేవ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి పనులు కానిచ్చారు. ఇదే సమయంలో మార్చి 31 డెడ్‌లైన్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో మొత్తానికి వారం, 10 రోజుల తిరిగైనా దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించారు. 25శాతం మినహాయింపు డెడ్‌లైన్‌ను ఉపయోగించుకున్న చాలామంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం డబ్బులు చెల్లించగా.. ఇప్పు డు ఆ దరఖాస్తుల ఆమోదానికి కూడా నెలలు గడుస్తుండటం ఇబ్బందికరం అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రహసనంగా ఆన్‌లైన్‌ క్లియరెన్స్‌..

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఉమ్మడి జిల్లా 9 మున్సిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 2020లో 1,58,265 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క కార్పొరేషన్‌ పరిధిలోనే 1,00,989 దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తుల క్లియరెన్స్‌ 2020 తర్వాత పెండింగ్‌లో పడగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. 25శాతం రాయితీతో మొత్తం 1,43,121 దరఖాస్తులపై ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించగా, వరంగల్‌ కార్పోరేషన్‌లో 96 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ఈ స్థలాలన్నీ హసన్‌పర్తి, ఖిలావరంగల్‌, కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్‌, గీసుకొండ, మామునూరు తదితర మండలాల పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిపై ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించి ఐదారు నెలలు గడుస్తున్నా 40 శాతానికి పైగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఎల్‌–1 స్టేజ్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు బాఽధితులు చెబుతున్నారు. ఎల్‌–1 అధికారి ధృవీకరించి ఎల్‌–2కు సిఫారసు చేస్తే.. ఎల్‌–3లో ఉన్నతాధికారులు క్లియర్‌ చేస్తారు. ఇందుకోసం ఎల్‌–1 స్థాయి అధికారిని కలిస్తే స్పాట్‌ వెరిఫికేషన్‌ రేపు, మాపు అంటూ ఐదారు నెలలుగా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి, పేర్లు చెప్పడానికి జంకుతున్నారు. ఇప్పటికై న కార్పొరేషన్‌, మున్సిపాలిటీల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించిన వారి ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. కాగా, జీడబ్ల్యూఎంసీ అధికారులు మాత్రం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై నిబంధనల ప్రకారం ప్రాసెస్‌ జరుగుతోందని, దశల వారీగా అన్ని క్లియర్‌ చేస్తామని చెబుతున్నారు.

కార్పొరేషన్‌/మున్సిపాలిటీల వారీగా

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఇలా..

జిల్లా మున్సిపాలిటీ దరఖాస్తులు

గ్రేటర్‌వరంగల్‌ కార్పొరేషన్‌ 1,00,989

హనుమకొండ పరకాల 3,182

వరంగల్‌ నర్సంపేట 5,421

వర్ధన్నపేట 522

మహబూబాబాద్‌ మానుకోట 12,201

డోర్నకల్‌ 872

మరిపెడ 2,629

తొర్రూరు 10,299

జేఎస్‌ భూపాలపల్లి భూపాలపల్లి 3,771

జనగామ జనగామ 18,379

మొత్తం 1,58,265

ఎక్కడి దరఖాస్తులు అక్కడే.. సగం వరకు ఆన్‌లైన్‌లోనే పెండింగ్‌

ఎల్‌–1, ఎల్‌–2 స్థాయి దాటని వైనం.. సాగని స్పాట్‌ వెరిఫికేషన్‌

జీబ్ల్యూఎంసీతోపాటు

మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి

దరఖాస్తుదారులకు తీరని చిక్కులు.. ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement