
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి●
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఆత్మకూరు: విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. మండలంలోని గుడెప్పాడ్‌లోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైద్య పరీక్షలను డీఎంహెచ్‌ఓ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.