
మెరుగైన వసతులు
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
నాణ్యమైన
బోధన..
విద్యారణ్యపురి: కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)ని అమల్లోకి తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది. ఎంపికచేసిన పీఎంశ్రీ స్కూళ్లలో వసతులు కల్పించేందుకు నిధులు కేటాయిస్తోంది. ఎన్‌ఈపీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో 644 పాఠశాలలను కేంద్రం ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక చేసింది. ఇందులో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున పీఎం స్కూల్ ఉంది. నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు, విద్యార్థుల నమోదు ప్రాతిపదికన వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల మోడల్ స్కూల్ (పీఎంశ్రీ), హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ)ను బెస్ట్ పీఎంశ్రీ స్కూళ్లుగా ఎంపిక చేశారు. వీటిలో మరిన్ని సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉంది.
గవిచర్ల మోడల్ స్కూల్..
గవిచర్ల మోడల్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్యనందిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు ఉన్నాయి. స్కూల్‌లో 600 మంది విద్యార్థులు, ఇద్దరు ఒకేషనల్ టీచర్లు, ఒకరు అవర్లీ బేస్డ్ టీచర్ ఉన్నారు. నాలుగు సైన్స్ ల్యాబ్‌లు, రెండు ఒకేషనల్ ల్యాబ్‌లు, ఒక కంప్యూటర్ ల్యాబ్, ఏడు డిజిటల్ క్లాస్‌రూంలున్నాయి. ఇటీవల మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి. ఇందుకోసం మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా నియమించనున్నారు. పీఎంశ్రీకి ఎంపికై న ఈ స్కూల్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లోని పరికరాలకు కేంద్రం నిధులు మంజూరు చేయగా రాష్ట్ర విద్యాశాఖలోని సమగ్రశిక్ష నుంచి రూ.10 లక్షల విలువచేసే పరికరాలను అందజేసింది. విద్యార్థుల కోసం లైబ్రరీ ఉంది. అదేవిధంగా విద్యార్థులకు యోగాతోపాటు చెస్, ఖోఖోలో శిక్షణ ఇస్తున్నారు.
బెస్ట్ పీఎంశ్రీ స్కూళ్లు జాతికి అంకితం..
దేశంలో ఎంపికచేసిన బెస్ట్ పీఎంశ్రీ స్కూళ్లను ఈనెల 29న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ జాతికి అంకితం చేశారు. గవిచర్ల మోడల్ స్కూల్‌లో వరంగల్ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్, స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్పీ ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా హసన్‌పర్తి పాఠశాలలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పీజీ హెచ్‌ఎం ఎన్నంశెట్టి సుమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొని జాతికి అంకితం చేశారు.
న్యూస్‌రీల్
బెస్ట్ పీఎంశ్రీ స్కూల్స్‌గా గవిచర్ల మోడల్ స్కూల్, హసన్‌పర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపిక
ఎస్‌ఈపీ వార్షికోత్సవం సందర్భంగా
ప్రకటించిన కేంద్రం
మరిన్ని సదుపాయాల
కల్పనకు నిధులు వచ్చే చాన్స్
హసన్‌పర్తి ఉన్నత పాఠశాల..
హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెస్ట్ పీఎంశ్రీ స్కూల్‌గా ఎంపికై ంది. ఆరు నుంచి పదో తరగతి వరకు 140 మంది బాలురు, 105 మంది బాలికలు ఉన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయి. సమగ్రశిక్ష నుంచి రూ.10 లక్షల విలువైన పరికరాలను అందుబాటులో ఉంచారు. ఇన్‌ప్లాంట్ ప్యానల్ (ఐపీఎఫ్) సాయంతో యూట్యూబ్ ద్వారా బోధన చేస్తున్నారు. ఈ స్కూల్‌లో వివిధ సదుపాయాలకు రూ.లక్ష వరకు నిధులు వస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు గ్రంథాలయాన్ని కూడా అందుబాటులో ఉంచారు. బాక్సింగ్ పోటీల్లో హసన్‌పర్తి పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు. 10 మంది విద్యార్థులు జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీలో ఫిజికల్ డైరెక్టర్ శిక్షణ ఇస్తున్నారు. తరగతి గదుల మరమ్మతుల కోసం రూ.7 లక్షలు విడుదలయ్యాయి. ప్రతి ఏడాది పీఎంశ్రీ స్కూల్‌గా గ్రాంట్ రూ.75 వేలు వస్తున్నాయి. ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

మెరుగైన వసతులు

మెరుగైన వసతులు

మెరుగైన వసతులు