
రెండు, రెండున్నర అంగుళాలే..
లక్నవరం సరస్సులో 8 లక్షల 33వేల చేప పిల్లలు వదిలాం. గతేడాది జూన్‌లో పోయాల్సిన చేప పిల్లలను ఆలస్యంగా ఆగస్టు మొదటి వారంలో పోశాం. చెరువులో వదిలేటప్పుడు చేప పిల్ల లు 3 అంగుళాల మీద అర ఉండాలి. రెండు, రెండున్నర అంగుళాలే ఉన్నాయి. దీంతో సైజుతో పాటు ఒక నెల ఆలస్యంగా వదలడం వల్ల చేపలు పట్టే సమయానికి అర కేజీ నుంచి కేజీ బరువు నష్టం జరుగుతుంది. దీనితో దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు.
– పి.వెంకన్న, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, లక్నవరం
●