ఆలయాల్లో ‘కార్తీక’ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో ‘కార్తీక’ వెలుగులు

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంతో పాటు

ఆత్మకూర్‌, అమరచింతలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాయంత్రం ఆలయాలు దీపాల వెలుగుల్లో కళకళలాడాయి. జిల్లాకేంద్రంలోని చింతల ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరాలయం, సత్యసాయి ఆలయం, రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల రాకతో సందడి నెలకొంది. సాయంత్రం వేళ ఆలయాల ఆవరణలో దీపాలు వెలగించడంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. అయ్యప్ప ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడంతో ప్రాంతణమంతా కాంతులీనింది.

అనంతరం పడిపూజ మహోత్సవం నిర్వహించారు. రామాలయంలో

జ్వాల తోరణం వెలిగించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు.

– వనపర్తి రూరల్‌, ఆత్మకూర్‌, అమరచింత

ఆత్మకూర్‌లో జ్వాల తోరణం..

జ్వాలా తోరణం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement