పండుగ సాయన్న చరిత్ర భావితరాలకు అందించాలి | - | Sakshi
Sakshi News home page

పండుగ సాయన్న చరిత్ర భావితరాలకు అందించాలి

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

● ఆయన ఆశయ సాధనకుప్రతి ఒక్కరూ కృషి చేయాలి

● ఐదు గ్రామాల్లో విగ్రహాలను

ఆవిష్కరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

గండేడ్‌: బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందించాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు. మంగళవారం గండేడ్‌ మండలంలోని కొంరెడ్డిపల్లి, వెన్నాచేడ్‌, సల్కర్‌పేట్‌, రెడ్డిపల్లి, గండేడ్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పండుగల సాయన్న విగ్రహాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన సాయన్న పేదల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నిరుపేదలకు అండగా నిలిచి, సామూహిక వివాహాలు నిర్వహించి, ఆకలితో ఉన్నవారి కడుపు నింపిన గొప్ప వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందని, విద్యా, సామాజిక రంగాల్లో వారు ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.

ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిగిలో ఎకరం భూమి కేటాయించి, గండేడ్‌లో ముదిరాజ్‌ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పండుగల సాయన్న సేవలు, పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌, కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాసాని వీరేష్‌, మత్స్యశాఖ జిల్లా మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, విగ్రహాల దాత ఆగం పాండు, ముదిరాజ్‌ సంఘం గౌరవాధ్యక్షుడు కొమిరె లక్ష్మయ్య, అధ్యక్షుడు బోయిని గోపాల్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి జితేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement