కొత్తకోట రూరల్: ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఆర్థిక భద్రత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. అర్హులందరికీ అందించడమే లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అమడబాకులలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై చేయూత లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. చేయూత పింఛన్‌తో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర లబ్ధిదారులకు ఆర్థికంగా కొంత భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మృతిచెందితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భద్రత కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ పథకంపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తోందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గాయత్రి అనిల్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ బీచుపల్లియాదవ్, రావుల జితేంద్రనాథ్‌రెడ్డి, గ్రామపెద్దలు సత్యారెడ్డి, రంగారెడ్డి, ఉప సర్పంచ్ బాలరాజు, శ్రీనుయాదవ్, మన్యం, కావలి తిరుపతయ్య, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.


