రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో మంగళవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14, 17 విభాగాల ఉమ్మడి జిల్లా బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు నిర్వహించారు. కార్యదర్శి వేణుగోపాల్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ రానున్న ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో రాణించాలని కోరారు. పట్టుదల, సమష్టిగా ఆడితే క్రీడల్లో విజయాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికలకు దాదాపు 250 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌బాబు, పీడీలు నాగరాజు, రాఘవేంద్ర, నాగమణి, లక్ష్మినారాయణ, చరణ్‌, మోహన్‌, శ్రీకాంత్‌, సునీత, గౌరి, వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement