గద్వాల: ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణషీప్ మరియు గోట్ డెవలప్‌మెంట్ కో–ఆపరేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా, గ ట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాట్ చైర్మన్‌గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేష న్ చైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు.
కొల్లె సరిత బీఆర్‌ఎస్ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌గా కూడా పనిచేశారు.
కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా నాగరాజుగౌడ్
అమరచింత: పట్టణానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్‌ను రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్‌పార్టీ బలోపేతంతో పాటు మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాగరాజుగౌడ్‌కు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది.
● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన
‘చైర్మన్ గిరి’


