శిక్షణ అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

శిక్షణ అదుర్స్‌

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

నీట్‌, ఐఐటీ, క్లాట్‌ పరీక్షలకు ప్రత్యేక తరగతులు

జిల్లాలో 4 కేజీబీవీల నుంచి..

ప్రతి సబ్జెట్‌కు 40 మంది విద్యార్థులు ఎంపిక

ప్రభుత్వ నిర్ణయం కేజీబీవీ విద్యార్థినులకు వరం

శిక్షణ బాగుంది

ప్రస్తుతం అమరచింతలోని కేజీబీవీలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. నీట్‌ శిక్షణకు ఎంపియ్యా. నాకు డాక్టర్‌ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చదువుకుంటున్న పాఠశాలలోనే నీట్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. రోజువారీగా తరగతుల నిర్వహణతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించి, ప్రోత్సహిస్తున్నారు.

– దివ్యశ్రీ, కేజీబీవీ అమరచింత

క్లాట్‌లో శిక్షణ పొందుతున్నా..

నేను సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. ప్రభుత్వం కేజీబీవీల వి ద్యార్థునుల కోసం పోటీ పరీక్షలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తుండటంతో క్లాట్‌పై శిక్షణ పొందడానికి గోపాల్‌పేట కేజీబీవీకి వచ్చా. విషయాల వారీగా బోధనతో పాటు సౌకర్యాలు బాగున్నాయి.

– భవ్యశ్రీ, కేజీబీవీ, గోపాల్‌పేట

నీట్‌లో ర్యాంకు సాధిస్తా..

అమరచింత కేజీబీవీలో నీట్‌పై శిక్షణ ఇస్తున్నారని ఎస్‌ఓ చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. రోజువారి తరగతుల నిర్వహణ తీరు బాగుంది. సబ్జెక్టుల్లో అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేస్తున్నారు. మొదటి సారిగా ఇస్తున్న శిక్షణను ప్రేరణగా తీసుకుని వచ్చే సంవత్సరం మరింతగా రాణించి నీట్‌లో మంచి ర్యాంకు సాధిస్తా. – పల్లవి, కేజీబీవీ వనపర్తి

డాక్టర్‌ కావాలనేది కల..

నీట్‌ శిక్షణపై పట్టు సాధించి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించేందుకు శిక్షణ తోడ్పడనుంది. తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడికి శిక్షణకు వచ్చా. వసతులతో పాటు అవగాహన ఉన్న సీఆర్‌టీల ద్వారా శిక్షణ ఇప్పించడం బాగుంది. డాక్టర్‌ కావాలనే కల నేర్చుకుంటాను.

– పూజ, బైపీసీ, చిన్నంబావి

రోజు వారీగా..

జిల్లాలోని 4 కేజీబీల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు మూడు కేజీబీవీల్లో ఒకొక్క పోటీ పరీక్షపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు ఆయా కేజీబీవీలకు వెళ్లి విద్యార్థినులకు అందుతున్న బోధన గురించి ఆరా తీస్తున్నాం. వచ్చే ఏడాది వరకు ఆయా సబ్జెట్‌ల్లో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి అనుకున్న ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. – శుభలక్ష్మి..జీసీడీఓ

అమరచింత: కేజీబీవీల్లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినులు నీట్‌, ఐఐటీ, క్లాట్‌ వంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లాలోని 4 కేజీబీవీలను ఎంపిక చేసి ప్రతి కేజీబీవీ నుంచి టాప్‌ టెన్‌లో ఉన్న 10 మంది విద్యార్థి నులను ఎంపిక చేస్తూ.. వేసవి సెలవులు వృథా కాకుండా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులను కల్పించి ఆయా సబ్జెట్‌లపై పట్టున్న సీఆర్‌టీల ద్వారా రోజువారి తరగతులను బోధించే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షణతో పాటు జిల్లా విద్యాధికారుల తనిఖీలు, జీసీడీఓ ఆకస్మిక తనిఖీలతో నాణ్యతతో కూడిన బోధన అందించడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షలపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు.

మొదటి ప్రయత్నం..

కేజీబీవీలో ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ, ఈసీటీ చదువుతున్న వారికి నీట్‌, క్లాట్‌, ఐఐటీ పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తొలి ప్రయత్నంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు లైబ్రరీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధిచిన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లైబ్రరీ స్టడీకి అవకాశం కల్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement