జిల్లాలోని చిన్నంబావి, శ్రీరంగాపురం, వనపర్తి, అమరచింత మండలాల్లోని కేజీబీవీల నుంచి ఒకొక్క సబ్జెట్ నుంచి 10 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. అమరచింత కేజీబీవీని నీట్ శిక్షణ కోసం ఎంపిక చేయగా.. ఐఐటీ శిక్షణ కోసం వనపర్తి కేజీబీవీ, క్లాట్ శిక్షణ కోసం గోపాల్‌పేట కేజీబీవీని ఎంపిక చేసి తరగతులు ప్రారంభించారు. నీట్ శిక్షణకు వచ్చిన విద్యార్థినులకు రోజువారీగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాలపై గంటన్నర పాటు శిక్షణ ఇస్తున్నారు.
అమరచింత కేజీబీవీలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థినులు


