ప్రశాంతంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement