‘ఉపాధి’ పనులకు కూలీల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పనులకు కూలీల సంఖ్య పెంచాలి

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

ఖిల్లాఘనపురం: ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచేందుకు మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని డీఆర్‌డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం ఖిల్లాఘనపురం వచ్చిన ఆమె సర్పంచు పద్మమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఏపీఓ లక్ష్మి, ఈసీ సత్యం, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌తో మాట్లాడుతూ.. వివరాలు సేకరించారు. మండల వ్యాప్తంగా గతేడాదితో పోల్చితే కూలీల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతేడాది ఈ సమయంలో 2 వేల మంది కూలీలు మండలంలో పనికి హాజరైతే.. ఇప్పుడు ఆ సంఖ్య 1,150 పడిపోయిందన్నారు. జిల్లావ్యాప్తంగా మే నెలలో 1.23 లక్షల మంది కూలీలు పనిచేయాల్సి ఉండగా కేవలం 12 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారని తెలిపారు. పనులు చేసిన కూలీలందరికీ ఏప్రిల్‌ 15 నాటికి కూలి డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసిందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా ప్రజాప్రతినిధులు చొరువ తీసుకోవాలని సూచించారు. రైతులు ఎవరైనా అర ఎకరం వరకు మునగ పంట సాగు చేస్తే ఉపాధి పథకం ద్వారా సహకారం అందిస్తామని పేర్కొ న్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తు న్న మహిళా సంఘం భవనం, దివ్యాంగుల భవనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో నాయ కులు ఆగారం ప్రకాష్‌, నాగేష్‌ పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement