కొనుగోలు కేంద్రాల్లో వేలం సమయంలో గుత్తేదారు తన అనుచరులనే నలుగురిని నియమించుకొని వేలం పాడుతున్నట్లు నటించి తను అనుకున్నట్లుగా రైతులకు తక్కువ రేటు చెల్లిస్తున్నాడు. రశీదు కూడా ఇవ్వరు. నగదు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నారు. చీడపీడల నివారణ, కాయలు తెంపేందుకు కూలీల రేట్లు, ట్రాన్స్‌పోర్ట్, తరుగు మొత్తంగా ఎకరాకు రూ.80 వేలు ఖర్చు వస్తే విక్రయించిన తర్వాత రూ.20 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
వీపనగండ్లలో కాయల నాణ్యతను చూపిస్తున్న రైతులు


