వనపర్తి: పోలీస్ సిబ్బంది తమ ప్రతిష్టను పెంచేలా, క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా సూచించారు. సాయుధ దళ పోలీసు కార్యాలయాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి, కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్, స్పోర్ట్స్ విభాగం, బాంబ్ డిస్పోజల్ టీం, మోటార్ వాహనాల విభాగాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి, నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ, సామగ్రి వినియోగం, వాహనాల స్థితిగతులను సమీక్షిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని, శాఖ ప్రతిష్టను దష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖ ప్రతిష్ట సిబ్బంది క్రమశిక్షణ, పనితీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి.
జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా


