హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి

May 1 2026 8:26 AM | Updated on May 1 2026 8:26 AM

రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

కొత్తకోట రూరల్‌: ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ కోరారు. గురువారం పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పౌరహక్కుల దినంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మనిగిళ్ల, చిన్నమందడి, వెల్టూర్‌, పెద్దమందడిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీశారు. సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా కొనసాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని సూచించారు.

పెట్రోల్‌బంక్‌ల తనిఖీ..

మండలంలోని కనిమెట్ట, పెద్దమందడి మండలం వెల్టూరులోని పెట్రోల్‌బంకును గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరా నిరంతరం కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌, తహసీల్దార్‌ పాండునాయక్‌, ఎంపీడీఓ పరిణత, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement