కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న పలువురు లబ్ధిదారుల గృహాలను సందర్శించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని, గౌరవప్రదమైన జీవనం అందించడమే ధ్యేయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ పి.అరుణ శ్రీనివాస్, వైస్ చైర్‌పర్సన్ పి.పల్లవి కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి


