పదిలో మెరిసిన బాలికలు | - | Sakshi
Sakshi News home page

పదిలో మెరిసిన బాలికలు

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

అత్యఽధికంగా

జెడ్పీ విద్యార్థులే ఫెయిల్‌..

ప్రైవేట్‌ విద్యార్థుల హవా..

7,027 మంది విద్యార్థులు పాస్‌..

రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచిన

వనపర్తి

106 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత

వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడైన విషయం విధితమే. జిల్లా విషయానికొస్తే గత విద్యాసంవత్సరం రాష్ట్రంలో 29వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 19వ స్థానానికి ఎగబాకడం విద్యాశాఖ అధికారులకు కాస్త సంతృప్తినిచ్చింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 89 ఉండగా.. ప్రస్తుతం 97.46 శాతానికి చేరుకోవడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే బాలికలదే పైచేయిగా కొనసాగింది.

ఆశ్రమ పాఠశాలలో వందశాతం..

జిల్లాలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. బీసీ వెల్ఫేర్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా విద్యాలయాల్లో 88 శాతం నుంచి 98 శాతం నుంచి వరకు ఉత్తీర్ణత నమోదైంది.

జిల్లావ్యాప్తంగా 7,219 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా.. 183 మంది ఫెయిల్‌ అయ్యారు. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 149 మంది ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 17 మంది, కేజీబీవీల్లో నలుగురు, మోడల్‌ స్కూల్‌లో ముగ్గురు, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఐదుగురు, మైనార్టీ గురుకులాల్లో ఇద్దరు, సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఫెయిల్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఒక్కరు గైర్హాజరు కావడంతో ఉత్తీర్ణత వందశాతం నమోదు కాలేదు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

జిల్లాలోని పెబ్బేరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని పి.అర్షిత 577 మార్కులు, పాన్‌గల్‌ మండలం కదిరెపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని అస్నాన్‌ 576 మార్కులు, జిల్లాకేంద్రంలోని హరిజనవాడ పాఠశాల విద్యార్థి నజీర్‌ 566 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 175 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా.. 106 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.

జిల్లాలో 97.46 శాతం ఉత్తీర్ణత నమోదు

పైవ్రేట్‌ పాఠశాల విభాగంలో ఆత్మకూర్‌లోని ఎస్‌వీఎస్‌ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థిని శ్రీనిధి 585 మార్కులు, జిల్లాకేంద్రంలోని సీవీ రామన్‌ పాఠశాల విద్యార్థిని సంజన 582 మార్కులు, ఆత్మకూర్‌లోని శ్రీవాణి పాఠశాల విద్యార్థిని దీప్తి 579 సాధించి తమదైన ముద్ర వేశారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 7,219 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 7,027 మంది ఉత్తీర్ణత సాఽధించారు. వీరిలో బాలురు 3,594 మంది పరీక్షలు రాయగా, 3,462 మంది ఉత్తీర్ణత సాధించగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. మరో 129 మంది ఫెయిల్‌ అయ్యారు. బాలికల విషయానికొస్తే 3,625 మంది పరీక్షలు రాయగా.. 3,565 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరుకాగా.. మరో 54 మంది ఫెయిల్‌ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్ని సెక్టార్లలో బాలికల ఉత్తీర్ణత శాతమే అధికంగా ఉన్నట్లు ధ్రువీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement