ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి చూపాలి

Apr 29 2026 7:18 AM | Updated on Apr 29 2026 7:18 AM

వనపర్తి రూరల్‌: ఆయిల్‌పాం పంటను ఒక్కసారి సాగు చేస్తే ఏళ్ల తరబడి ఆదాయం పొందవచ్చని.. రైతులు సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాణిజ్య పంటల కంటే ఆయిల్‌పాం సాగుకు అధిక ప్రోత్సాహం, రాయితీ అందిస్తోందని వివరించారు. మండలంలో 200 ఎకరాల్లో పంట సాగు లక్ష్యంగా నిర్ణయించిందని.. రాయితీతో పాటు అంతర పంటల సాగుకు రూ.4,200 చెల్లిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి భాస్కర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి షేక్‌ మున్నా, మండల ఉద్యాన అధికారి కృష్ణయ్య, ఏఈఓ ఆంజనేయులు, గ్రామస్తులు పరశురాం, అర్జున్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement