పాన్‌గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, మాందాపూర్, చింతకుంటపల్లి, చిన్నంబావి మండలంలోని వెలుగొండ, గోపాల్‌పేట మండలంలోని నాగపూర్ పల్లె దవాఖానాల నుంచి ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో తెరుచుకోవడం లేదు. ఈ కేంద్రాల్లోని సిబ్బంది కూడా కేవలం వ్యాక్సిన్ ఉన్న బుధవారం రోజు కొద్దిసేపు తెరిచి ఉంచుతున్నారు. రేమద్దుల, బుసిరెడ్డిపల్లిలోని దవాఖానాలు వైద్యులున్నా సక్రమంగా తెరుచుకోవడం లేదు, అన్నారంలోని దవాఖానా మాత్రం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. పల్లె దవాఖానాలు సక్రమంగా తెరవకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.


