స్వీయ నమోదు.. | - | Sakshi
Sakshi News home page

స్వీయ నమోదు..

Apr 28 2026 7:23 AM | Updated on Apr 28 2026 7:23 AM

సద్వినియోగం చేసుకోవాలి..

1,139 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు..

ఏప్రిల్‌ 26 నుంచి మే నెల పది వరకు..

వివరాలు నమోదు చేసుకుంటున్న ఉద్యోగులు, ప్రజలు

జనగణన–2007లో భాగమే

రెండ్రోజుల్లో 490 మంది..

–8లో u

వనపర్తి: జనగణన–2027 స్వీయ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మే నెల పది వరకు పౌరులు వారి కుటుంబ వివరాలను నిర్దేశిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేందుకు భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం విధితమే. మొదటిరోజు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు.

జిల్లాలోని 15 మండలాలు, ఐదు పురపాలికలను 1,139 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌లో 700 నుంచి 800 జనాభా ఉండేలా మ్యాపింగ్‌ చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఇంటి నిర్మాణం, పైకప్పు, వాహనాలు, రేషన్‌ కార్డు తదితర 33 రకాల ప్రశ్నలకు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో జవాబులు నమోదు చేయాల్సి ఉంటుంది. స్వీయ నమోదు సమయంలో సెల్‌నంబర్‌ ఆధారంగా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విధిగా ఇంటి లోకేషన్‌ను మార్క్‌ చేయాలి. మొదటిరోజు 182 మంది అధికారులు చేసుకోగా.. రెండోరోజు మధ్యాహ్నం వరకు సుమారు 490 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు సీపీఓ హరికృష్ణ వెల్లడించారు.

జిల్లాలో ఇలా..

సిద్ధం చేసిన హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ల మ్యాపింగ్‌ల ప్రకారం జనగణన ప్రక్రియ తొలి విడత ప్రారంభమవుతుంది. మే నెల 11 నుంచి అధికారులు 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకుగాను 1,139 మంది హెచ్‌ఎల్‌పీబీలు, 1,081 మంది ఎన్యూమరేటర్లు, 193 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ విధానంలో కొనసాగనుంది.

దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమంగా భారత ప్రభుత్వం జనగణన– 2027 ప్రారంభించింది. స్వీయ నమోదు అవకాశాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలి. మొదటి దఫా ఇళ్ల గణన, జనాభా గణన 2026, మే 11 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. ఏ దర్యాప్తు ప్రయోజనాల కోసం ఈ సమాచారాన్ని వినియోగించబడదు.

– హరికృష్ణ, సీపీఓ, వనపర్తి

15 రోజులు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement