ముగిసిన కో–ఆప్షన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కో–ఆప్షన్‌ ఎన్నిక

Apr 28 2026 7:23 AM | Updated on Apr 28 2026 7:23 AM

ఆత్మకూర్‌: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరిగింది. పుర కమిషనర్‌ చికినే శశిధర్‌, చైర్‌పర్సన్‌ నాగమణి, వైస్‌ చైర్మన్‌ నల్గొండ శ్రీను, కౌన్సిలర్లు పాల్గొన్నారు. క్యాటగిరి–1 నుంచి శ్రీనివాసులు, సౌజన్య గంగాధర్‌, క్యాటగిరి–2 నుంచి జహంగీర్‌, సన జహీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ శివకుమార్‌, ఎస్‌ఐ జయన్న తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

దళిత సంఘాల ఆందోళన..

కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో దళిత వర్గానికి అన్యాయం జరిగిందని.. అర్హులైన వారిని సైతం విస్మరించారని దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ బైలా ప్రకారం ఎన్నిక జరగలేదని.. పట్టణంలో రెండు వేల ఓట్లున్న దళితులను విస్మరించి అవమానించారని నాయకులు రవీందర్‌, బుచ్చన్న, గాలిపంపు శ్రీను తదితరులు ఆరో పించారు. కలెక్టర్‌తో పా టు రాష్ట్రస్థాయి అధి కారులకు ఫిర్యాదు చేయ నున్నట్లు తెలిపారు.

మైనార్టీల నిరసన..

40 ఏళ్లుగా కాంగ్రెస్‌పార్టీలో ఉంటూ సేవలందించిన వారిని కాదని ఇటీవల వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారంటూ మైనార్టీ యువకులు నిరసన వ్యక్తం చేశారు. మైనార్టీ విభాగంలో సీనియర్‌ నాయకుడు మెకానిక్‌ షబ్బీర్‌ను కాదని జహంగీర్‌కు పదవి కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement