మదనాపురం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దంతనూరులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదల చిరకాల కోరిక సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. ప్రజా ప్రభుత్వానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న తమను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం గ్రామంలో హమాలీ కార్మిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ నాగరాజుగౌడ్, మార్కెట్ డైరెక్టర్ పావనిరెడ్డి, మాజీ సర్పంచ్ రాజవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటన్న, గుగ్గిళ్ల రాములు, వివిధ గ్రామాల సర్పంచులు సుజాత నాగరాజు, శ్రావణ్ కుమార్, చింతకుంట శేఖర్, అంజాద్ అలీ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సాగుతో అధిక దిగుబడులు
కొత్తకోట రూరల్: రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాలెం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం రాయితీపై అందజేసిన డ్రోన్‌ను ప్రారంభించి మాట్లాడారు. డ్రోన్‌తో ఎరువులు, పురుగు మందులు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్ వినియోగాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి


