ప్రతిరోజు రెండుపూటలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిరోజు రెండుపూటలు..

Apr 26 2026 2:09 AM | Updated on Apr 26 2026 2:09 AM

ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే చాయ్‌కు ఇది పూర్తిగా భిన్నమైంది. దవాచాయ్‌కి పాలు, చక్కెర, టీపొడి అవసరం ఉండబోదు. 24 మూలికల చూర్ణంను నీటిలో మరిగించి నేరుగా తీసుకోవడమే. మరిగించిన నీరు ముదురు గులాబీ రంగులోకి వస్తే.. ప్రతిరోజు రెండుపూటలా చాయ్‌ కప్పు మోతాదులో తీసుకుంటే.. చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని ప్రాంతాల్లో ఈ చాయ్‌కు డిమాండ్‌ పెరిగింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చాయ్‌ సెంటర్‌కు ఉదయం సుమారు 250 నుంచి 500 మంది వస్తుంటారు. కొందరు దవాచాయ్‌ తాగితే.. మరికొందరు గ్రీన్‌ జ్యూస్‌ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement